ఏపీ వైష్ణవ ఆలయాల్లో రద్దీ...

07:40 - January 8, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వార్లు ఉత్తరద్వార దర్శనం గుండా దర్శనమిస్తున్నారు. ప్రముఖ ఆలయాలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉదయం నుండే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్ లు అన్నీ నిండిపోతున్నాయి. ముక్కోటి ఏకాదశి, ద్వాదశి విశిష్ట పర్వదినోత్సవాల సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి శ్రీవారి దర్శించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.

విజయవాడలో...
విజయవాడలోని చిట్టినగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయాన్నే భక్తులు పోటెత్తడడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. చెరుకుగడలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు టెన్ టివికి నిర్వాహకులు పేర్కొన్నారు. సాయంత్రం స్వామి..అమ్మవారి విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

Don't Miss