కవితకు మహిళా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు : శ్రీధర్‌బాబు

19:50 - February 28, 2017

జగిత్యాల : టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై మాజీమంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కవితకు మహిళల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించేలా కేసీఆర్‌ మాట్లాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాలలో జనవేదన సదస్సు నిర్వహించారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.  నిజామాబాద్‌ పసుపు, చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం కవిత కృషి చేయాలని శ్రీధర్‌బాబు కోరారు.

 

Don't Miss