'స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట'..

13:20 - August 3, 2017

'స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట'..ఏంటీ విడ్డూరం కాదు...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీహెచ్..ఆంధ్రాబ్యాంకు..ఇలా ఇతర బ్యాంకులు ఉంటాయి కానీ టమాట ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది నిజం. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో లో ఈ బ్యాంకు వెలిసింది. దీని గురించి పూర్తి వివరాలకు చదవండి..

టమాట..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాశమైంది. టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో టమాటను ఏకంగా దొంగతనం చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం టమాటల ధరలు దిగిరావడం లేదు. దీనితో చాలా మంది టమటాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో భారీగా పడుతున్న వర్షాలకు టమాట పంట ధ్వంసమౌతోంది.

మండుతున్న టమాట ధరలుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ టొమాటో' పేరిట బ్యాంకును తెరిచారు. బుధవారం ఈ బ్యాంకు కూడా తెరిచేశారు. లోనుగా నగదు ఇస్తే ఈ బ్యాంకులో టొమాటోలను రుణాలుగా ఇస్తుంటారు. ఈ విషయం తెలిసిన పలువురు బ్యాంకుల ఎదుట బారులు తీరారంట. తమ వద్దనున్న టొమాటోలను డిపాజిట్ చేస్తే ఆరు నెలల అనంతరం రెట్టింపు మొత్తంలో టొమాటోలను వస్తాయని వెల్లడిస్తున్నారంట.

మరి బ్యాంకు ఏర్పాటు చేశారు సరే..టొమాటోలను భద్ర పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూడాలి. 

Don't Miss