హెచ్ సీయూలో దళిత విద్యార్థుల సస్పెన్షన్‌పై భగ్గుమన్న విద్యార్థి లోకం

12:36 - November 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో 10 మంది దళిత విద్యార్థుల సస్పెన్షన్‌పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వీసీ అప్పారావు నిర్ణయంపై టీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు వెంకటేష్ చౌహన్ తీవ్రంగా మండిపడ్డారు. వీసీ అప్పారావు నియంతృత్వ వైఖరి అవలంభిస్తున్నారని దళిత విద్యార్థులను కావలనే వేధింపులకు గురిచేస్తున్నారని హెచ్ సీయూలో జాక్ నాయకులు ఆరోపించారు. గచ్చిబౌలి యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్‌లో ఏఎస్ ఏ, ఎస్ ఎఫ్ ఐ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 10 మంది విద్యార్థులపై వెంటనే సస్పెండ్ ఎత్తి వేయాలని..లేకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Don't Miss