సోము వీర్రాజు ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

16:05 - February 5, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలో సోము వీర్రాజు ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేశారని నిరసిస్తూ వీర్రాజు ఇంటిని ముట్టడించారు. సామరస్యంగా నిరసన తెలియజేస్తున్న తమపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని విద్యార్థులంటున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో భూస్థాపితం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss