స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాలీ

13:21 - February 12, 2018

హైదరాబాద్ : ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ హైదరాబాద్‌ సాధ్యమని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే... ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాంగనర్‌ కార్పొరేటర్‌ వి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 15వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. మూడు నిమిషాలపాటు రోడ్లు ఊడ్చి గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌...స్వచ్ఛనగరంగా హైదరాబాద్‌ను దేశంలో మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌, వినోద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితోపాటు పలువురు ప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.  

Don't Miss