టీడీపీలో చేరిన సుబ్రమణ్యం రెడ్డి

07:35 - January 30, 2018

చిత్తూరు : జిల్లా వైసీపీ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్‌ సుబ్రమణ్యం రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశంపార్టీలోచేరారు. మునిస్వామిరెడ్డిగారి సుబ్రమణ్యంరెడ్డికి పార్టీ కండువా కప్పి సీఎం సాదరంగా ఆహ్వానించారు. 654 మందితో టీడీపీలోకి వచ్చిన సుబ్రమణ్యంరెడ్డి గతంలో చంద్రబాబుపై మూడు సార్లు పోటీచేశారు. పార్టీలో చేరినవారిందరిని మనస్పూర్తిగా.. సాదరంగా ఆహ్వానిస్తున్నానని సీఎం అన్నారు. తనపై మూడు సార్లు పోటీచేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుబ్రమణ్యం రెడ్డి మాత్రమే అని చెప్పారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తూ... హుందాగా వ్యవహరించే వ్యక్తి పార్టీలో చేరడంపట్ల సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను సీఎం ఐతే కుప్పం లోని ప్రతి ఒక్కరూ సీఎం అయినట్లుగా భావిస్తూ... తనను ఆదరించిన కుప్పం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Don't Miss