అప్పుడే మొదలైన ఎండలు..

09:48 - February 10, 2017

సన్ అప్పుడే మొదలెట్టేశాడు..ఫిబ్రవరి మొదటి వారం నుండే భానుడు ప్రతాపం మొదలైనట్లు వాతావరణ మార్పులు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా తగ్గిపోయి అదే క్రమంలో ఎండ వేడిమి పెరుగుతోంది. కానీ శివరాత్రికి చలి వెళ్లిపోతుందని ప్రజల నమ్మకం. ఈ నెలాఖరుకు శివరాత్రి ఉండగా ఫిబ్రవరి నెల మొదట్లోనే చలి తీవ్రత తగ్గిపోయింది. గత సంవత్సరం కంటే భానుడు భగభగలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళలు..తెల్లవారు సమయాల్లో కూడా చలి తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి మొదటి వారంలో తీవ్రత పెరిగిన ఎండలు ఈసారి ఫిబ్రవరిలోనే ప్రతాపం చూపుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చలికాలం ఫోబియా నుంచి బయటికొచ్చేసి వేసవి కాలం ఉపశమన చర్యలకు ఉపక్రమించాల్సిన తరుణం రానే వచ్చిందని గమనించాలన్న మాట.

Don't Miss