ఫైనల్స్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్..

08:28 - May 26, 2018

పశ్చిమబెంగాల్ : ఐపీఎల్‌ ఫైనల్లోకి హైదరాబాద్‌ దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కోల్‌కతా ను మట్టికరిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించిన సన్‌రైజర్స్‌ గ్రాండ్‌గా ఫైనల్లోకి ఎంటర్‌ అయ్యారు. ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది.

చెలరేగిపోయిన సన్ రైజర్స్..
ఈడెన్‌గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌ చెలరేగిపోయారు. పదునైన బౌలింగ్‌తో నైట్‌రైడర్స్‌కు చుక్కలు చూపించారు. 13 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదాబాద్‌ టీం.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే సిద్ధార్థ్‌ కౌల్ వేసిన నాలుగో ఓవర్‌లో నరైన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రాత్‌వైట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రషీద్ వేసిన 9వ ఓవర్ మూడో బంతికి రానా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రషీద్ బౌలింగ్‌లోనే ఉతప్ప్‌ 2పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

జట్టును ఆదుకునేందుకు గిల్ యత్నం..
కెప్టెన్ దినేశ్ కార్తీక్ 8 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లిన్ పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 48 పరుగులు చేశాడు. కానీ రషీద్ వేసిన 13వ ఓవర్ 2 బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో లిన్ స్లిప్‌లో ఉన్న ధవన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో కోల్‌కతా కష్టాల్లోపడింది. కష్టాల్లోపడ్డ జట్టును శుభ్‌మాన్ గిల్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. సన్‌రైజర్స్ బౌలింగ్‌ని ధీటుగా ఎదురుకుంటూ.. మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి ఉండగా.. బ్రాత్‌వైట్ బంతులకు మావీ, గిల్‌లు వరుసగా పెవిలియన్ కు చేరారు. దీంతో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో 13 పరుగల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈనెల 27న ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ తలపడనుంది. 

Don't Miss