ప్రిన్స్ కు 25th టెన్షన్‌..

16:35 - June 4, 2018

భరత్‌ అనే నేను సినిమాతో సూపర్‌ హిట్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ టెన్షన్‌ వెంటాడుతోంది. త్వరలో తన సిల్వర్‌ జూబ్లీ సినిమాకు రెడీ అవుతున్న మహేష్ తెగ వర్రీ అయిపోతున్నాడు. ఎందుకా వర్రీ అనుకుంటున్నారా..? ఈ జనరేషన్‌ హీరోల్లో ఏ హీరోకు కూడా 25వ సినిమా పెద్దగా కలిసి రాలేదు. అందుకే మహేష్ కూడా తన 25వ ఫిలిం విషయంలో టెన్షన్‌ పడుతున్నాడట.

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన మిడియం రేంజ్ హీరోలు మాత్రం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నారు. ఫ్లాప్ లు అప్పుడప్పుడూ బ్రేక్ వేస్తున్నా.. హిట్ జోష్ ను క్యాష్ చేసుకొని వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. అందుకే మీడియం రేంజ్ హీరోలు తక్కువ సమయంలోనే సిల్వర్ జూబ్లీ స్టార్స్ గా మారుతున్నారు. అయితే ఇలాంటి స్టార్స్‌కు కూడా 25వ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది.

యంగ్ హీరోలకు మాత్రమే కాదు సూపర్‌ స్టార్‌లకు కూడా 25వ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. భారీ మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్లు కూడా ఈ సెంటిమెంట్‌తో కష్టాల్లో పడ్డారు.

Don't Miss