'ఒకే ఒక్కడు' సీక్వెల్ లో రజనీ ?

09:52 - August 10, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఓ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. 'శంకర్‌' దర్శకత్వంలో 'ముదల్వన్‌' తమిళనాట ఎంత విజయం సాధించిందో తెలిసిందే. 'అర్జున్‌' హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో 'ఒకే ఒక్కడు' పేరిట వచ్చింది.

ఈ సినిమాలో నటించాలని 'రజనీ'ని చిత్ర బృందం కలిసిందని..కానీ ఆయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదంట. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చేస్తే యాక్ట్ చేయడానికి 'రజనీ' ఆసక్తి చూపుతున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్‌ కథను సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే 'రజనీకాంత్' త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో ఆ సినిమా ఉండడం..రజనీకి కలిసొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు శంకర్ అయితే కరెక్టుగా సరిపోతాడని అనుకుంటున్నారంట. సీఎంగా 'రజనీ' అయితే ఎలా ఉంటుందనే విషయాన్ని ముందుగా జనానికి తెలియజేసే ప్రయత్నంలో భాగమని అనుకుంటున్నారు.

మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

Don't Miss