ట్రిపుల్ తలాక్‌పై కొనసాగుతున్న విచారణ

16:43 - May 17, 2017

ఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టులో ఐదోరోజు విచారణ కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉంటుందా అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్వల్ప కాలంలో ట్రిపుల్ తలాక్‌ చెప్పి, వివాహాన్ని రద్దు చేసే అవకాశం భర్తకు లేకుండా నిఖానామాలో నిబంధనను చేర్చవచ్చునని బోర్డు తరపున వాదనలను వినిపిస్తున్న కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. బోర్డు సూచనలను కాజీలు తప్పనిసరిగా పాటిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. బోర్డు సూచనలు తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం కాజీలకు లేదని బోర్డు తరపున వాదిస్తున్న మరో న్యాయవాది యూసఫ్‌ ముచాలా సమాధానమిచ్చారు. ట్రిపుల్ తలాక్‌ ఓ పాపమని...దీన్ని పాటించిన వారిని బహిష్కరించాలని ఏప్రిల్‌ 14న ముస్లిం పర్సనల్‌ లా బోర్డు చేసిన తీర్మానాన్ని కోర్టుకు సమర్పించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ట్రిపుల్‌ తలాక్‌పై గత నాలుగురోజులుగా విచారణ కొనసాగిస్తోంది. 

Don't Miss