సుప్రీంకోర్టు కొలీజియం భేటి

09:35 - May 12, 2018

ఢిల్లీ : చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం ఇవాళ భేటీ అయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్ పేరును సిఫార్సు చేయాలని మరోసారి నిర్ణయించింది. కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరుపై ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. ఇదివరకే ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినా ఏప్రిల్‌లో జోసెఫ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో కొలీజియం మరోసారి సమావేశమైంది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ సహా కొలీజియంలోని ఐదుగురు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కొలీజియం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ చలమేశ్వర్‌ గురువారం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

Don't Miss