కథువా ఘటనపై సుప్రీం ఆదేశాలు..

08:15 - April 17, 2018

ఢిల్లీ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తాము నిర్దోషులమని, తమకు నార్కో టెస్టు చేయాలని ట్రయల్‌కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు బదలాయించాలని, తమకు, తమ న్యాయవాదికి భద్రత కల్పించాలని కోరుతూ బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎనిమిది నిందితుల్లో ఒకరైన మైనర్‌ నిందితుడిని ఉంచిన జువెనిల్‌ హోంలో భద్రతను పటిష్టం చేయాలని...ఈ హత్యోదంతంపై సమగ్ర విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

బాధితురాలి తండ్రి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ
బాధితురాలి తండ్రి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసును చండీగఢ్‌కు బదలాయిస్తున్నారా... లేదా...అన్న విషయాన్ని ఏప్రిల్‌ 27 లోగా సమాధానం ఇవ్వాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎనిమిదేళ్ల చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

8 మంది నిందితులను కోర్టుకు హాజరు
జమ్ముకశ్మీర్‌ కథువా జిల్లా ట్రయల్‌ కోర్టులో కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. 8 మంది నిందితులను కోర్టుకు హాజరు పరిచారు. తాము నిర్దోషులమని.... ఈ కేసులో తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని వారు న్యాయమూర్తిని కోరారు. కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ కాపీలను నిందితులకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు.
బెదిరింపులు వస్తున్నాయి : దీపికా రజావత్‌
ఈ కేసులో తనకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి తరపు వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్‌ తెలిపారు. తనపై కూడా అత్యాచారం, హత్య జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.బైట్‌ దీపికా రజావత్‌, బాధితురాలి తరపు న్యాయవాది.ఈ ఏడాది జనవరిలో కథువా జిల్లాలో 8 ఏళ్ల బాలికను అపహరించి గుడిలో నిర్బంధించారు. బాలికకు మత్తు మందిచ్చి వారం రోజుల పాటు దుండగులు లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  

Don't Miss