శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ

16:13 - October 13, 2017

ఢిల్లీ : కేరళలోని ప్రముఖ క్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు బదిలీ చేసింది. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం మహిళల ప్రవేశానికి సంబంధించి పలు సందేహాలను లేవనెత్తింది. 'మహిళలు ప్రవేశించకుండా ఆలయం అడ్డుకోగలదా?' 'ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకుంటే వారి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా?' తదితర అంశాలపై రాజ్యాంగ ధర్మాసనం చర్చించాలని ముగ్గురు జడ్జిల బెంచ్‌ నిర్ణయించింది. శబరిమల అంశంపై ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే తీర్పును ఇవ్వగలదని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 

 

Don't Miss