శ్రీదేవి మృతిపై జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు

16:58 - May 11, 2018

ఢిల్లీ : బాలీవుడ్‌ నటి శ్రీదేవి మృతి కేసులో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీదేవి అనుమానస్పద మరణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సునీల్‌సింగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ శర్మ విచారణ జరిపారు. ఇప్పటికే ఇలాంటి రెండు పిటిషన్లను నిరాకరించామని గుర్తు చేశారు. శ్రీదేవి పేరిట ఒమన్‌లో 240 కోట్లు ఇన్సూరెన్స్‌ ఉందని, ఆమె యూఏఈలోనే చనిపోయిందని తేలితేనే ఆ డబ్బు ఇస్తారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు మాత్రం తాము ఈ కేసులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పెళ్లి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి హోటల్‌ రూమ్‌ బాత్‌టబ్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Don't Miss