మతాల వివాదం..సీఐ,ఎస్సై సస్పెండ్..

17:40 - May 4, 2018

నాగర్‌కర్నూల్ : రెండు మతాల మధ్య వివాదంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలపై కల్వకుర్తి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో మార్చి 27న జరిగిన ఒక సంఘటన రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది. దీనిపై సీఐ, ఎస్‌ఐ మితిమీరి ప్రవర్తించారని, బెయిల్‌ విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులకు, హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంపై సమగ్రంగా విచారించిన ఉన్నతాధికారులు, సీఐ శ్రీనివాసరావును, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.  

Don't Miss