తెలంగాణలో నియంతృత్వ పాలన : జీవన్‌రెడ్డి

11:04 - June 4, 2018

జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందంటూ విమర్శించారు. యాభై ఎనిమిదేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో యాభైఆరు వేల కోట్లు అప్పుచేస్తే.. కేవలం నాలుగేళ్ళలోనే 1లక్షా 40వేల కోట్లు అప్పు చేసిన ఘనత టీఆర్ఎస్‌ ప్రభుత్వానిదని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనుల్లో కమీషన్‌ కోసం కక్కుర్తి పడి రాష్ర్టాన్ని తాకట్టుపెడుతున్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

 

Don't Miss