సమస్యలు పక్కకు...పై చేయి కోసం పాకులాట...

09:23 - March 13, 2018

హైదరాబాద్ : అంతే..మళ్లీ సభలో సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి...అధికార పక్షం..విపక్షం పై చేయి సాధించుకోవడం కోసం పాకులాడుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చ కావాల్సిన సభ రణరంగంగా మారిపోయింది. ప్రజలకు సంబంధించిన సమస్యలు పక్కకు పోయి నేతల సవాళ్లు..ప్రతి సవాళ్లు ముందుకొస్తున్నాయి.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సభలనుద్దేశించి ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడం..పేపర్లు చించడం చేశారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ సభ్యులు మద్యం తాగి సభకు వచ్చారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపణలు చేయడం మరింత వివాదానికి దారి తీసింది. దీనిపై నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం నాడు జరిగిన ఘటనపై సర్కార్ చర్యలకు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసనసభా సభ్యత్వాల రద్దు...పదవీకాలం ముగిసే దాక వరకు లేదా ప్రస్తుత సమావేశాలు ముగిసేదాక సస్పెన్షన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Don't Miss