తెలంగాణ సమగ్రాభివృద్ధికై టీమాస్‌ ఫోరం పోరు : తమ్మినేని

19:44 - August 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం టీమాస్‌ ఫోరం పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  అన్ని సామాజిక తరగతులు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఒకరో ఇద్దరు అభివృద్ధి అయినంత మాత్రాన యావత్‌ తెలంగాణ అభివృద్ధి అయినట్టు కాదన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా గార్డెన్స్‌లో టీమార్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న తమ్మినేని.... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. గోరక్షణ దళాల పేరుతో దాడులు జరుగుతోంటే మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావుతోపాటు పలువురు సామాజిక, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

 

Don't Miss