కేసీఆర్ సర్కార్..సమస్యలు పరిష్కరించాలి...

13:17 - January 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతుండడంపై టీ మాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డబుల్ బెడ్ రూం..ఫీజు రీయింబర్స్ మెంట్..ఉద్యోగాల భర్తీ..డీఎస్సీ భర్తీ చేయాలని..కనీస వేతనాలు అమలు చేయాలని..తదితర డిమాండ్లతో టీ మాస్ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట భారీ ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కూడా భారీగా ప్రజలు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గళమెత్తారు. ఉదయం నుండి నేతలు..ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించే వరకు తాము కదిలేది లేదని టీ మాస్ నేతలు స్పష్టం చేశారు. కానీ పోలీసులు లోనికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో కూడా ఆందోళనలు కొనసాగాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss