మంత్రి రావెలపై స్వపార్టీ కార్యకర్తలే..

17:43 - January 10, 2017

గుంటూరు : మంత్రి రావెలపై సొంతపార్టీ కార్యకర్తలు తిరగడ్డారు. రావెల వున్న వేదికపైకి దూసుకొచ్చారు. దీంతో ఆప్రాంతంలో గందరగోళం నెలకొంది. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం పుసులూరు జన్మభూమి కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్యకర్తల గొడవతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత కొంతకాలంగా ప్రత్తిపాడు నియోజక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన మంత్రిపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను పట్టించుకోకుండా వేరే పార్టీ నుండి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కార్యకర్తల నిరసనపై మంత్రి ఏమాత్రం స్పందించలేదు.

Don't Miss