హిజ్రా వేషధారణలో ఎంపీ శివప్రసాద్‌ వినూత్న నిరసన

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

Don't Miss