మేనిఫెస్టోలోవన్నీ చేసేశామన్న బాబు...

16:54 - July 12, 2018

విజయవాడ : అధికారంలోకి రాకముందు పార్టీ మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందని..అందులో పేర్కొన్నవే కాకుండా మిగతావి కూడా పూర్తి చేయడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోటు బడ్జెట్...రాజధాని లేకుండా పాలన ప్రారంభించామని...విభజన చట్టం వల్ల జరిగిన నష్టం దేశంలో నెంబర్ వన్ గా అయినా దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడడానికి 10-12 సంవత్సరాలు అవుతుందని..జాగ్రత్తగా పాలన చేయకపోతే మరో బీహార్ తయారయ్యేదని పేర్కొన్నారు.

కరెంటు వాడితే పెనాల్టీ వేసేవారని...వ్యవసాయంలో చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. ఎరువుల మందులు..విత్తనాల సమస్యలు..ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. ఆనాడు జరిగిన కొన్ని ఘటనలను ఇంకా గుర్తుకొస్తాయని..లాఠీలతో కొట్టి ఒక్కొక్కరికి ఎరువుల బస్తాలు ఇచ్చారన్నారు. వ్యవసయాన్ని అస్తవ్యస్థం చేశారని..క్రాప్ గిట్టుబాటు ధర లేక..అవినీతి..ఆరాచకాలు..వ్యాన్ పిక్ సిటీ..లేపాక్షి సిటీ...విశాఖపట్టణంలో బాక్సైట్..లలో అవినీతి జరిగిందన్నారు. జలయజ్ఞం...కాదు ధనయజ్ఞం అంటూ పలు ఆరోపణలు గుప్పించి పోరాటం చేయడం జరిగిందని...సుమారు 300 మంది కార్యకర్తలను చంపేశారన్నారు.

కరెంటు విషయంలో రైతులు కాపలా ఉండే పరిస్థితి నెలకొని ఉండేదని..దీనివల్ల పలువురు రైతులు మృత్యువాత పడ్డారన్నారు. దానికంటే ముందు అనంతలో తాను పర్యటించే సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని మొదటగా చెప్పడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసినట్లు, రుణమాఫీ విషయంలో బ్యాంకులు సహకరించలేదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని..కానీ కొన్ని రాష్ట్రాలు అధిక ఆదాయం కలిగినవని..అయినా ఏపీలో లక్షా 50వేల రూపాయల రుణమాఫీ ప్రకటించడం జరిగిందన్నారు. అందులో రూ. 50వేలు ఒకేసారి మాఫీ చేయడం జరిగిందన్నారు.

ఎమ్మెస్పీ ఇవ్వకున్నా ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు సమకూర్చిందన్నారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. 60 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 200 అన్నా క్యాంటీన్లు పెడుతామన్నారు. గౌరవ ప్రదంగా భోజనం పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 200 భవనాలు ఏసీలు మార్చాలని చెప్పడం జరిగిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు ఒక సొసైటీ ఏర్పాటు చేసి..ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని..ఇందులో ప్రజల సహకరించాలని సూచించారు. ఇంట్లో జరిగే శుభకార్యక్రమాలకు అన్యా క్యాంటీన్లకు డోనేట్ చేయాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగ భృతి త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని..మహిళా వితంతు ఫించన్..వికలాంగుల ఫించన్ నేరుగా లబ్ధి దారుల ఇంటికే చేరే విధంగా ప్రభుత్వం చేస్తోందన్నారు. బయో మెట్రిక్ లో ఐరీస్ తీసుకోవాలని..ఐరీస్ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం చూసుకోవాలని...ఏదైనా సమస్యలు వస్తే అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజల జీవిత భద్రతకు డబ్బులు ఇస్తున్నామని..పెళ్లి కానుకలో కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయని తొందరలో ఈ సమస్య పరిష్కరించి పెళ్లి కానుకలు అందచేస్తామన్నారు. 19 లక్షల ఇళ్లు నిర్మాణం చేసి అర్హులైన పేదలకు అందచేయడం జరుగుతుందని, ఇటీవలే మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులకు ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss