రైతు సమాఖ్యల పేరుతో రాజ్యాంగేతర శక్తులు : రేవంత్‌

20:20 - September 1, 2017

హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను నీరుగార్చే జీవో నెంబర్ 39ని వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ టీడీపీ ప్రకటించింది. రైతు సమన్వయ సమితుల పేరుతో రాజ్యాంగేతర శక్తులను సృష్టిస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా విడుదల చేసిన జీవో 39కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు. 

Don't Miss