టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశం...

14:14 - July 12, 2018

విజయవాడ : త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఒకవైపు ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు..అసెంబ్లీ..పార్లమెంట్ లకు ఒకేసారి ఎన్నికలు జరుపాలని కేంద్రం యోచిస్తుండడ..తదితర పరిణామాలతో ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని...కేంద్రంలో చక్రం తిప్పాలని వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా కార్యకర్తలు..నేతలు..ఆయా నియోజకవర్గాల నేతలతో భేటీలు జరుపుతున్నారు.

గురువారం సీఎం నివాసం పక్కనున్న గ్రీవెన్స్ సెల్ లో టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు హాజరు కానున్నారు. ఈనెల 16 నుండి ప్రారంభించతలపెట్టిన 'గ్రామ దర్శిని' కార్యక్రమం జనవరి 10వరకు కొనసాగించాలని..ఇందుకు సంబంధించిన విధి విధానాలు సమావేశంలో ఖరారు చేయనున్నారు.

గ్రామాలు..పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని బాబు నేతలకు దిశా..నిర్ధేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 18న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టడానికి బాబు యోచిస్తున్నట్లు సమాచారం. 

Don't Miss