నేడు 5వ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర ప్రారంభం

12:13 - September 9, 2017

హైదరాబాద్ : ఇవాళ టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం 5వ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర ప్రారంభంకానుంది. ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతుంది. ఇందుకోసం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. నేరుగా ఆయన ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర వెళ్తారు. అక్కడ నుంచి స్ఫూర్తి యాత్రను ప్రారంభించనున్నారు.  మంచిర్యాలలో ఈ యాత్ర ముగియనుంది. 

 

Don't Miss