ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. త్యాగాల తెలంగాణ రాలేదు : గద్దర్‌

22:16 - January 5, 2018

జగిత్యాల : ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ త్యాగాల తెలంగాణ రాలేదన్నారు టీ మాస్‌ నేత గద్దర్‌. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఒక్కటికూడా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు కానీ ఇంకా నిరుద్యోగులు అలానే ఉన్నారన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఒక్కరు కూడా లేరంటూ ఆరోపించారు. 

Don't Miss