'కరుణా' ఆరోగ్యంపై టెన్షన్...

09:09 - July 30, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కావేరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వైద్యులు అస్పష్టత కూడిన హెల్త్ బులెటిన్ లను విడుద చేస్తోంది. కరుణా ఆరోగ్యం కొంత విషమంగా ఉందని..మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు..

నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఒక బులెటిన్ లో పేర్కొన్నారు. ఆరోగ్యం విషమంగా ప్రకటించడంతో ఎలాంటి అశుభవార్త వినవస్తుందోనని అభిమానులు ఉత్కంఠకు గురయ్యారు. దీనితో భారీగా కరుణా అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఉదయమించే సూర్యుడిలా ఆసుపత్రి నుండి బయటకు రావాలంటూ తమిళ భాషలో కరుణా నిధి అభిమానులు నినదిస్తున్నారు.

కొంత ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం వాస్తవమే కానీ వైద్యులు చికిత్స అందించడంతో కొలుకున్నారని రాజా మీడియాతో పేర్కొన్నారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను మోహరించారు. సేలం పర్యటనలో ఉన్న సీఎం పళనీ స్వామి అర్ధాంతరంగా కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss