వినోద్ కు బుజ్జగింపులు...

11:31 - November 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పార్టీలో అసమ్మతులు చల్లబడడం లేదు. తమకు టికెట్ రాదని..టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీలోకి జంప్ కావాలని పలువురు నేతలు యోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వేరే పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 107 మంది అభ్యర్థులను ప్రకటించేసిన గులాబీ బాస్ మరికొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టారు. నవంబర్ 2వ తేదీ అవుతున్నా ఇంకా ఆ స్థానాలను అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీనితో టికెట్ ఆశిస్తున్న వారు..తమకు టికెట్ వస్తుందని అనుకుంటున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. 
Image result for gaddam vinod congress partyమాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత గడ్డం వినోద్ పార్టీ మారుతారనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. ఆయన దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారని, సొంత గూటి (కాంగ్రెస్)లో చేరుతారని పుకార్లు షికారు చేశాయి. చెన్నూరు నుండి బరిలో దిగాలని వినోద్ ఆలోచించారు. ఆయన అలక బూనారని తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది.
శుక్రవారం మంత్రి కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ వీడొద్దని..భవిష్యత్ లో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ తో మాట్లాడిస్తానని తెలియచేసినట్లు సమాచారం. దీనితో ఆయన పార్టీ మారే విషయాన్ని పునరాలోచిస్తున్నట్లు సమాచారం. మరి మంత్రి కేటీఆర్ హామీ మేరకు టీఆర్ఎస్ లోనే గడ్డం వినోద్ ఉంటారా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss