టీఆర్ ఎస్ కార్పొరేటర్‌ రాజీనామా

13:54 - September 10, 2017

కరీంనగర్‌ : జిల్లాలో టీఆర్ఎస్ నేతల విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వైఖరిని నిరసిస్తూ 30వ డివిజన్ కార్పొరేటర్ జయశ్రీ.. పార్టీకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా సీఎం కార్యాలయం, మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌కు పంపించినట్లు జయశ్రీ తెలిపారు. తనపై ఓడిన అభ్యర్థికి కమలాకర్‌ ప్రాధాన్యత ఇస్తూ... వార్డు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బలహీనవర్గానికి చెందిన తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఓవైపు ప్రభుత్వం కరీంనగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించగా... పనుల్లో అధికార పార్టీ నేతల జోక్యం ఎక్కువ కావడంతో... ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు గుప్పుమన్నాయి. 

 

Don't Miss