సింగరేణిలో అధికార పార్టీ కోడ్ ఉల్లంఘన...!

15:37 - October 4, 2017

పెద్దపల్లి : సింగరేణి ఎన్నికలను ప్రభుత్వం..టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీబీజీకేఎస్ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పలు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నది తామేనని..ఎవరు ఏమీ అనరు అనుకున్నారో ఏమో గాని ఎన్నికల కోడ్ ను యదేచ్చగా ఉల్లంఘస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగిసిపోయింది.

కానీ అధికార పార్టీకి చెందిన నేతలు మాత్రం ఇంకా ప్రచారం నిర్వహిస్తున్నారని ఇతర కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం ఏకంగా జీడీకే 5 ఇంక్లెన్, 11 ఇంక్లెన్ గనుల వద్ద ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించడం గమనార్హం. అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీజీబీకేఎస్ గెలిపించాలంటూ వారు ప్రచారం నిర్వహిస్తున్నారని, వివిధ సంఘాల నేతలు..కార్మికులను టీజీబీకేఎస్ లోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొంటున్నారుర. కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొంటున్నారు. 

Don't Miss