అమ్మని అక్కనని తిట్టుకుంట చెప్పులెపిన ఎమ్మెల్సీ

20:10 - October 9, 2017

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారంట.. ఒక వేస్టు ఫెల్లోనట.. ఇది నేనంటున్న ముచ్చటగాదు సుమా..? కోపానికొచ్చేరు చంద్రన్న దండు.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సారు మాట.. మరి ఆయనకు ఏడగనిపిచ్చిందో ఈన వేస్టు అన్న ముచ్చట జర్ర అర్సుకుందాం పాండ్రి.. రఘువీరా సారుగూడ అప్పుడప్పుడు ఎటో మాట్లాడుతుంటడు..

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఎంత పెద్ద పనిజేశిండో సూస్తిరా..? ఒకలింట్ల కిరాయికి ఉన్నడు.. ఆ ఇంటి ఓనర్కు కిరాయిస్తలేడు.. ఖాళీ జేయిమంటే.. అమ్మని అక్కనని తిట్టుకుంట చెప్పులు లేవడ్తున్నడు.. నీకు దిక్కొచ్చిన కాడ జెప్పుకో.. జైలుకు వంపిస్త..? నక్రాలు జేస్తె అని..? వాని పైశ్చం..? మరి ముఖ్యమంత్రిగారూ.. మీ పార్టీ ఎమ్మెల్సీ బాగోతం మీరు గూడ జూడాలే..

కూట్లె రాయితీయలేనోడు.. ఏట్లె రాయిదీస్తందుకు వొయ్యిండట.. అగో అట్లనే ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి ముచ్చట గూడ.. ప్రభుత్వం పథ్కాలళ్ల.. అడ్గుగడ్గుకు అవినీతి..? ప్రగతి భవనం సౌజన్యంతోని నడుస్తుంటే.. దీన్ని కంట్రోల్ జేయలేని సారు.. సింగరేణి బొగ్గుల అవినీతి గుట్టను గడ్డపార ఏశి తొవ్వుతాంటున్నడు.. ఇనెటోడు అమాయకుడైతె.. చెప్పెటోనికేం బాధ.. అంతేనా..?

రింజుం రింజుం హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరిగిర తిర్గితె.. మోటరు కారూ బలాదూర్ అని ఒక సీన్మ పాటుండేగదా... ఇప్పుడు గడ్క ఆ సీన్మ దీశేదుంటే.. ఈ పాటగూడ వాడకపోతుండే.. హైద్రావాద్ ఆలత్ అట్ల మారిపోయింది.. మొత్తం ముర్కి పట్నాలళ్ల జాబితా దీస్తు మనదే ఫస్టుంటుండొచ్చు.. ఏం పట్నం పాడైంది.. వానలకు సూడుండ్రి..

వారెవ్వ ఇదొక అద్భుతమైన ముచ్చటనే సుమా.? ట్రావన్‌కోరోళ్ల గుడులున్నయ్ గదా..? అదే కేరళ.. అండ్ల కొన్ని వేల సంవత్సరాల సంది.. బాపణోళ్లే పూజలు జేశేది.. వాళ్లే మంత్రాలు సద్వేదిగదా.? కని కేరళ ప్రభుత్వం దీస్కున్న నిర్ణయంతోని నాల్గువేల ఏండ్ల నాగరికథకు ఫుల్ స్టాప్ బడ్డది.. పెద్దపెద్ద గుడులళ్ల పూజారులుగ ఎవ్వలిని వెట్టిండ్రో తెల్సా..? బీసీ,ఎస్సీలను వెట్టేశిండ్రు..

మొత్తం మీద సింహాన్ని దొర్కవట్టేశ్న..? పిల్లిని వట్కుంటెనే కొంతమంది భయపడ్తరుగదా..? మల్లన్నా ముచ్చట్లకు ఏకంగ సింహాన్నే వట్కొచ్చిన ఎందుకు ఇంత సాహసం అంటే.. మీకోసం మీకు జూపెట్టెతందుకు వట్కొచ్చిన అన్నట్టు.. అన్ని సింహాలు.. కరుస్తయ్ గదా.? ఈ సింహం కనీసం గాండ్రించగూడ గాండ్రించది.. అంత మంచి సింహం సూడుండ్రి మీరుగూడ..

వారెవ్వ పెండ్లంటే గిట్లుండాలే.. గీ నమూన జేయాలే..? విష్ణుమూర్తి, లచ్చిమిది దేవి పెండ్లి జూశిండ్రా... అంటే పౌరాణిక సీన్మలళ్ల జూడొచ్చుగని.. మనం ఒర్జినల్గ సూశింది లేదు.. పశ్చిమగోదావరి జిల్లాకు మొగులు మీదికెళ్లి దేవుండ్లంత దిగొచ్చి.. లచ్చిమి దేవికి విష్ణుమూర్తికి పెండ్లి జేస్తున్నరు.. ఇగ దేవుండ్లను సూడాలె అన్న కాయిసున్నోళ్లు మిస్సుగాకుండ్రి సుర్వు జేస్తున్న..

గో గిది అవినీతి మీద యుద్దం అంటే..? చైనా దేశమోడు ఎంత గొప్పపనిజేశిండో సూడుండ్రి.. ఆడ లంచాలు దీస్కునుడుకు అల్వాటు వడ్డ.. 13 లక్షల మంది ప్రభుత్వ అధికార్లకు శిక్షలు విధించిండ్రట.. మనతాన ఉన్నదా ఇట్ల..? ముఖ్యమంత్రి కాడికెళ్లి వార్డు మెంబర్ దాక.. తెల్లారి మొఖమే అవినీతిల గడ్గుతరు.. టిఫీన్ అవినీతితోనే.. లంచు డిన్నర్ గూడ అవినీతితోనే జేస్తరు.. వాళ్లకు మనకు తేడా గది..

Don't Miss