టీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం రసాభాస..

18:16 - November 14, 2017

రంగారెడ్డి : జిల్లా అమన్‌గల్‌ మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం రసాభాసగా సాగింది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దళిత నేత మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌ ఫోటో పెట్టలేదని దళితులు ఆందోళన చేశారు. దళితులను అవమాన పరుస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు. పొనుగోటి అర్జున్‌ రావు అనే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని తన సొంత వ్యవహారంగా భావించి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహారిస్తున్నారని దళితులు ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని దళిత నాయకులు తెలిపారు. 

Don't Miss