శీలానికి వెల కట్టిన టీఆర్ఎస్ సర్పంచ్ భర్త..

18:58 - January 3, 2017

కరీంనగర్ : సర్పంచిగా ఆ గ్రామానికి మహిళ ఎన్నుకోబడింది...ఆమె అంటే అందరికీ గౌరవమే...ఆమెతో పాటు భర్తకు కూడా సమాన గౌరవం ఇచ్చేవారు..దీంతో అతను ఎంతో హుందాగా ఉండాల్సింది పోయి పోకిరీగా మారాడు..కామాంధుడై కాటేయబోయాడు..జనం చేతికి చిక్కి పరువు బజారున పడేసుకున్నాడు...జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిని తలదించుకునేలా చేసింది...
సర్పంచ్ భర్తగా ఆడింది ఆట..
ప్రజాప్రతినిధి భర్తగా ఆడింది ఆట..తాను చెప్పినట్లు వినాలనే ధోరణి..మైనర్‌పై కన్నేసి దొరికిపోయిన దుర్మార్గుడు.. పంచాయితీ పెట్టించి శీలానికి వెలకట్టాడు.. మహిళల చేతిలో చావుదెబ్బలు తిన్న కామాంధుడు.. జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం.. ఇక్కడ మహిళల చేతిలో తన్నులు తింటున్న ఇతగాడు ఆ కొద్ది నిమిషాల ముందు సర్పంచ్ భర్తగా ఆడింది ఆట..పాడింది పాటగా ఉండేవాడు.. తాను చేసిన పెద్ద తప్పును కూడా పంచాయితీ పెద్దల మధ్య పెట్టి తాను చెప్పింది వినాలన్నట్లు చేశాడు..చివరకు శీలానికి వెలకట్టడంతో ఆగ్రహించిన మహిళలు చితగ్గొట్టారు...చేసిందే పెద్ద తప్పు...ఎంతో హుందాగా... ఆ గ్రామంలో పేరు సంపాదించాల్సినవాడు చివరకు ఇలా దొరికిపోయాడు...
మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం...
జగిత్యాల జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో అధికారపార్టీ సర్పంచ్‌గా మహిళ ఉంది...ఆమె భర్తదే రాజ్యం... సత్యం చెప్పినట్లు అక్కడ అన్ని పనులు నడవాలి...ఇలా పల్లెలో తన పెత్తనం చెలాయిస్తున్న సత్యం మూడు రోజులక్రితం మైనర్‌ బాలికపై ఘోరానికి పాల్పడబోయాడు..ఈ విషయం ఆలస్యంగా తెలిసిన  బాలిక తల్లిదండ్రులు పంచాయితీపెట్టారు..పెద్దల పంచాయితీలో తాను చేసింది తప్పని ఒప్పుకోకుండా పెత్తనం చెలాయిస్తూ లక్ష రూపాయలు ఇస్తానంటూ సర్పంచ్‌ భర్త సత్యం ప్రకటించాడు...అంతే అప్పటివరకు సహనంతో చూస్తున్న మహిళలంతా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు...బాలిక శీలానికి వెలకట్టడంతో సున్నం సత్యంను అక్కడే చితకబాదారు.. కూతురు వయసున్న బాలికపై సత్యం ఇలాంటి అఘాయిత్యం చేయడం దారుణమని మండిపడ్డారు.. ఎంతో హుందాగా ఉండాల్సినవాడు ..బాధ్యత మర్చి కామాందుడిగా మారాడు..అధికారం చేతిలో ఉంది కదా..ఏదైనా చేయొచ్చనుకుంటే ప్రజల కఠిన నిర్ణయాన్ని చవిచూడాల్సి వచ్చింది......తగిన బుద్ది చెప్పారు...

Don't Miss