శ్రీనివాసరెడ్డి అరాచకాలపై భార్య పోరాటం

07:08 - November 21, 2017

హైదరాబాద్ : అధికారపార్టీ యువజన నేత శ్రీనివాసరెడ్డి అరాచకాలపై పోరాటం చేస్తున్న రెండో భార్య సంగీత ఆందోళనకు మూడో భార్య తల్లి అండగా నిలిచింది..ఊహించని రీతిలో మలుపు తిరిగిన కేసులో ఇప్పటికే పోలీసులు శ్రీనివాసరెడ్డిని రిమాండ్ తరలించారు..అయితే న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని రెండోరోజు సంగీత ఆందోళన కొనసాగిస్తుంది...ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..

అధికారపార్టీ యువజన నాయకుడు శ్రీనివాసరెడ్డిపై పోరాటం చేస్తున్న రెండో భార్య సంగీతకు మూడో భార్య దేవీ జగదీశ్వరి తల్లి శిరీష మద్దతుగా నిలిచింది...సంగీత ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న శిరీష బోడుప్పల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరింది...రెండో భార్య సంగీతను ఓదార్చిన ఆమె తమకు అన్యాయం చేశాంటూ ఆమెతో పాటు కలిసి న్యాయపోరాటం చేస్తుంది.. ఈ కేసులో అనుకోని మలుపు తిరగడంతో పోలీసులు...అటు శ్రీనివాసరెడ్డి కుటుంబం కూడా ఖంగుతింది..

పులకండ్ల శ్రీనివాసరెడ్డి....36 ఏళ్ల శ్రీనివాస్‌రెడ్డి రియల్‌ఎస్టేట్‌ బిజినెస్ చేస్తుంటాడు..ముందునుంచే దూకుడు స్వభావం ఉన్న శ్రీనివాస్‌రెడ్డి అధికారిక పార్టీ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని యువజన నాయకుడయ్యాడు...ఇక ఖద్దరు ముసుగులో ఎన్నో అరాచకాలు చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నట్టింట్లో కూడా కట్టుకున్న భార్యలకు నరకం చూపించాడు...

ఇక వరంగల్ చెందిన యువతిని పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఎంతోకాలం కాపురం చేయలేదు..భార్యకు నరకం చూపించడంతో ఆమె దూరమైంది...ఆ తర్వాత శేరిలింగంపల్లి చెందిన సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు...రెండేళ్ల కాపురంలో కూతురు పుట్టింది...ఆడపిల్ల పుట్టిందంటూ వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయిన సంగీత అక్కడే ఉంది...న్యాయం చేయాలంటూ సంగీత చందానగర్‌, మేడిపల్లి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అప్పట్లో రిమాండ్‌కు తరలించారు. 


ఇక మూడో పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఆగలేదు...మూడో భార్య కుటుంబం వారి పెళ్లిని నిరాకరిస్తే తనకున్న అధికార బలంతో వారిని బెదిరించాడు..కేసులు పెట్టించాడు..చివరకు కాలనీ నుంచి పారిపోయేలా చేశాడు..చివరకు వారు కేసు పెడితే భార్యతో తాను మేజర్‌నంటూ సంతకాలు పెట్టించాడు...ఇలా అరాచకాలు సృష్టిస్తున్న శ్రీనివాసరెడ్డి నుంచి న్యాయం కావాలంటూ రెండో భార్య సంగీత నేరుగా అత్తారింటికి చేరడంతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.. స్థానికుల సమాచారంతో పారిపోయిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని రిమాండ్ తరలించారు...


మరోవైపు సంగీత రెండోరోజు కూడా భర్త ఇంటి ఎదుట తన ఆందోళనను కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. సంగీత  అంతకు ముందు శ్రీనిసవారెడ్డి ఇంటి గేటుకు వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది.  మరో వైపు ఆమె ఆందోళనకు మహిళా సంఘాలు అండగా నిలవడంతో ఆందోళన ఉధృతంగా మారింది. తనకు,తన కూతురికి న్యాయం జరిగేవరకు కదలనంటోంది సంగీత... ఆందోళన పెరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు...                           

Don't Miss