'పిఆర్సిని ప్రక‌టించాలి'...

16:40 - July 6, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు దేశం గర్వించేలా పిఆర్సిని ప్రక‌టించాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పిఆర్సిలో పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా 63 శాతం పిట్ మెంట్‌తో పాటు 30 శాతం ఐ ఆర్ ని ప్రక‌టించాల‌ని టిఎన్జివో, టిజివో సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స‌చివాల‌యంలో పే రివిజ‌న్ క‌మీష‌న్ చైర్మన్‌ను  క‌ల‌సి విడివిడిగా నివేదిక‌లు అందించారు.
సీఎం కేసీఆర్‌ ఆద‌ర్శవంత‌మైనా నిర్ణయం తీసుకోవాలి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ త‌మ పిఆర్సి విష‌యంలోనూ ఆద‌ర్శవంత‌మైనా నిర్ణయం తీసుకోవాల‌ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే  వివిధ కారాణాల‌తో రెండు సార్లు పిఆర్సిని కోల్పోయిన తాము..మ‌రో సారి అలా న‌ష్టపోకుండా చూడాల‌ని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
మా ప‌ట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి  
రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కీల‌క‌పాత్ర పోషిస్తున్న తమ ప‌ట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈమేరకు తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత‌లు  పిఆర్సి క‌మీటికి  ఓ నివేదిక అందించారు. 41 అంశాల‌తో టిఎన్జివో సంఘం అంద‌చేసిన వివ‌రాల ప‌ట్ల క‌మీష‌న్ సానుకూలంగా ఉన్నట్లు నేత‌లు చెప్పారు. 
ఖాళీ పోస్టులను బర్తీచేయాలి 
రాష్ట్రంలోని వివిధ స్ధాయిల్లో ఉద్యోగుల ప‌డుతున్న  ఇబ్బందుల‌ను కూడా ఆ నివేదిక‌లో పొందు ప‌ర్చారు. ఉద్యోగుల సంఖ్య తగ్గడంలో ప్రస్తుతం ఉన్న వారిపై భారం పడుతున్నందున ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.. వీటితో పాటు ప‌క్కన ఆంధ్ర ప్రదేశ్ తో పాటు చాల రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ఉద్యోగుల వయో పరిమితి ని పెంచాలని డిమాండ్ చేశారు. ఇక  కాలుష్యం వల్ల ప్రయాణంలో ఇబ్బందులకి గురి అవుతున్నందున పని దినాలు సంఖ్య ని 5 రోజులకి కుదించాలని డిమాండ్‌ చేస్తున్నారు
నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి 
వీటితో పాటు నూత‌న పెన్షన్ విధానాన్ని కూడా ర‌ద్దు తో పాటు మ‌హిల ఉద్యోగుల స‌మ‌స్యలు, గ్రామీణప్రాంతా ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ వంటి అంశాల‌నుకు కూడా నివేదిక‌లో పోందు ప‌ర్చారు. అయితే పిఆర్సి కి సంఘాల ప్రతిపాద‌న‌లు అందించే స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్నందన ఉద్యోగుల డిమాండ్లపై సీఎం కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తసుకుంటారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

 

Don't Miss