'వంటేరు ఒంటరి కాదు’..

16:03 - January 13, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ వంటేరు ప్రతాప్‌ రెడ్డిపై ఉద్దేశ్యపూరితంగానే కేసులు నమోదు చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. ప్రతాప్‌రెడ్డిపై పెట్టిన కేసు విషయంలో టీటీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి.. న్యాయం చేయాలని కోరారు. కేసీఆర్‌ రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నాడని.. టీటీడీపీ అధిష్టానం మేరకే వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఓయూ వెళ్లారని అన్నారు. భవష్యత్తులో సీఎంపై తిరిగి పోటీ చేసి గెలుస్తాడన్న భయంతోనే కేసీఆర్‌.. ప్రతాప్‌రెడ్డిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మోత్కుపల్లి నర్సింహ్మ అన్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మందకృష్ణలను వెంటనే విడుదల చేయాలని టి.టిడిపి డిమాండ్ చేసింది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఫిర్యాదు చేశామని..గవర్నర్ కి సమగ్ర వివరాలు అందించామని నేతలు తెలిపారు. మల్లన్న సాగర్ బాధితులకు ప్రతాప్ రెడ్డి అండగా నిలిచారని, ఆయనకు గజ్వేల్ లో ఆదరణ పెరుగుతోందని మోత్కుపల్లి పేర్కొన్నారు. కేసీఆర్ ఆయనపై కేసులు పెట్టిస్తున్నారని, చరిత్రలో ఉద్యమకారులను జైల్లో పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఓయూ విద్యార్థులతో కలిసి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఇప్పుడు ఓయూలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. 

Don't Miss