'జై లవ కుశ' లో తమన్నా ?

12:04 - August 30, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ పరిశ్రమ దృష్టిని ఈ చిత్రం ఆకర్షిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర మూడు పాత్రలకు సంబంధించిన ఫొటోలు..టీజర్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆయా టీజర్స్ వేటికవే భిన్నంగా ఉన్నాయి.

‘జై' పాత్ర మాస్, ‘లవ' పాత్ర క్లాస్ గా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న ‘కుశ' కు సంబంధించిన ఫొటో విడుదల చేశారు. ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రత్యేక గీతం ఉంటుందని..అందులో మిల్క్ బ్యూటీ 'తమన్నా' నర్తించనుందని ప్రచారం జరుగుతోంది. 'తమన్నా' కొత్త అవతారంలో కనిపిస్తారని చిత్ర వర్గాల టాక్. 'తమన్నా' ఇప్పటికే 'జాగ్వార్‌', 'అల్లుడు శీను' తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో ఆడిపాడిన సంగతి తెలిసలిందే. గతంలో 'ఎన్టీఆర్‌', 'తమన్నా' జంటగా వచ్చిన 'ఊసరవెల్లి' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ నెలాఖరున 'కుశ' టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Don't Miss