‘రోబో 2.0’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

09:11 - November 8, 2017

రజనీకాంత్..అక్షయ్ కుమార్..అమీ జాక్సన్ లు నటిస్తున్న 'రోబో 2.0’ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. ప్రముఖ దర్శకుడు 'శంకర్' భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శంకర్..రజనీ..ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది.

ఇందులో బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' నటిస్తున్నాడు. డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నారంట. సినిమాకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలు..చిత్రాలు కానీ రిలీజ్ కాలేదు. కానీ కొన్ని దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చిత్ర బృందం మాత్రం ట్రైలర్ ఇంకా విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మూవీలోని సాంగ్స్ ను ఇటీవ‌లే దుబాయ్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. మూవీ ట్రైల‌ర్ ను రజ‌నీకాంత్ పుట్టిన రోజైన డిసెంబ‌ర్ 12వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఈ మూవీ 15 భాష‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Don't Miss