తమిళనాడు అసెంబ్లీలో 'అమ్మ' ఫొటో...

21:15 - February 12, 2018

చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. స్పీకర్‌ ధన్‌పాల్‌ జయలలిత ఫొటోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎం పళనిస్వామి, డిప్యూటి సిఎం పన్నీర్‌ సెల్వం, అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డిఎంకె, కాంగ్రెస్‌, శశికళ మేనల్లుడు దినకరన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ జయలలిత ఫొటోను అసెంబ్లీలో ఏర్పాటు చేయడంపై డిఎంకె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జయలలిత ఫొటోను తక్షణమే తొలగించాలంటు డిఎంకె ఎమ్మెల్యే అన్భళగన్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తమిళనాడు అసెంబ్లీలో తిరుళ్లువర్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్, ముత్తు రామలింగదేవర్, అన్నాదురై, రాజాజీ, ఎంజీఆర్‌ తదితర నేతల ఫొటోలు ఉన్నాయి.

Don't Miss