తమిళనాట రోజుకో మలుపుతిరుగుతున్న రాజకీయాలు

07:05 - January 9, 2017

p { margin-bottom: 0.21cm; }

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దివంగత సీఎం జయలలిత మరణానంతరం తమిళనాట తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన అత్త ఆశయాలను నెరవేరుస్తానని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మరోసారి గొంతెత్తారు. తాను రాజకీయాల్లోని వస్తానని బహిరంగంగా తెలియజేయడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. వందలాది అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమెకు మద్దతు తెలిపేందుకు ఇంటిముందు బారులు తీరడంతో... తమిళనాట రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

శశికళపై దీపా ఆగ్రహం ...

జయలలిత మరణానంతరం తనను దూరంగా పెట్టిన శశికళపై దీపా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అత్త ఆసుపత్రిలో ఉండేటపుడు కనీసం చూడటానికి అనుమతించకపోవడంపై మండిపడ్డారు. జయలలిత చికిత్సపై సామన్య ప్రజల్లో నెలకొన్న సందేహాలే దీపాను కలిచివేస్తుండటంతో ఆమె సహించలేకపోయింది. తన అత్త మరణం వెనుక ఎన్నో అనుమానాలున్నాయని గొంతెత్తింది. జయలలిత మరణంపై జవాబు చెప్పాల్సిందేనని ప్రభుత్వాన్ని, శశికళను హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని..తన నిర్ణయాన్ని ఎంజీఆర్ జయంతి తర్వాత ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

దీపా జయకుమార్‌కు ప్రజల నుంచి మద్దతు...

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండటంతో ఇప్పుడు తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆమెకోసం మద్దతుగా వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరియగా...శశికళ వర్గంలో కలవరపాటు మొదలైంది. ఈ పరిణామాలు ఏ పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి మరి.

Don't Miss