పరువు హత్యపై పోరాడి గెలిచిన కౌసల్య..

15:21 - September 26, 2018

తమిళనాడు : కళ్లముందే కట్టుకున్నవాడిని నడిబజారులో కత్తులతో నరికేస్తే? కనని పెంచినవారే తన జీవితాన్ని భుగ్గి చేస్తే? కుల దురహంకారంపై ఢమరుకనాధం వినిపించి గెలుపు గుర్రం ఎక్కి సవారి చేసిన కులదురహంకారాని సవాలు విసిన వీరనారి ఆమె. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని గుండె దిటువు చేసుకుని డప్పు పట్టింది. కులోన్మాదానికి వ్యతిరేకంగా వీధుల్లో తిరుగుతూ డప్పు మోగించింది. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకునేవారికి బాసటగా నిలుస్తోంది. ఇటీవల ‘పరువు’కు బలైన అమృతవర్షిణిని కలిసి, ఆమెలో స్థయిర్యాన్ని నింపిన ఉద్యమకారిణి తమిళనాడుకు చెందినకౌసల్యా శంకర్‌ జీవితంలో ఎన్నో మలుపులు..గెలుపులు..
 
పెద్దలను ఎదిరించి కులాలకు అతీతంగా ప్రేమించినవాడి చేయిపట్టుకుని నడిచిన  జంటపై కొడవళ్లు, గొడ్డళ్లలతో పట్టపగలు దాడి చేసి తాను ప్రేమించి వివాహం చేసుకున్న శంకర్‌ను అందరూ చూస్తుండగానే, నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత ప్రపంచమంతా ప్రసారమయ్యాయి.  శంకర్‌ ప్రాణం గాలిలో కలిసిపోయింది. కౌసల్య కూలిపోయింది. కుదేలైపోయింది. ప్రేమించిన సహచరుడు క్షణాల్లో తన ఎదుటే రక్తం ముద్దగా జీవం లేకుండా పడి ఉన్న దృశ్యం కౌసల్యను పిచ్చిదాన్ని చేసేసాయి. సత్యం జీర్ణించుకోలేకపోయింది. దానికి కారణం కన్నతల్లిదండ్రులేనని తెలిసి తల్లడిల్లిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికిబైటపడ్డ కౌసల్య న్యాయ పోరాటం చేసి వారికి శిక్ష పడేట్టు చేయడంలో విజయం సాధించింది.తన లాంటి స్థితి మరొకరికి రాకూడదనుకుంది. కులాంతర వివాహాలు చేసుకునే యువతీయువకులకు బాసటగా నిలవాలనే నిర్ణయంతో ‘యాక్టివిజాన్ని’ ఆయుధంగా చేసుకుంది. దళితుల సంప్రదాయ డప్పు ‘పరై’ వాద్యాన్ని నేర్చుకుని, పరువు హత్యలను నిరసిస్తూ దాన్ని మోగించింది. అలుపెరుగని పోరాటం మొదలెట్టింది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన అమృత భర్త ప్రణయ్‌ పరువుహత్యను తీవ్రంగా ఖండించింది. అమృతది, తనది ఒకేలాంటి ఘటనలని, ఆమెకు అండగా ఉంటానని అమృతను స్వయంగా కలిసి గుండె ధైర్యాన్నిచ్చింది. అమృతకే కాదు అలాంటి ఎన్నో జంటలకు కౌసల్య ఇప్పుడు దళిత ‘పరై’. 

Don't Miss