నగరంలో మరోసారి 'కొకైన్' కలకలం...

10:14 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో కొకైన్ విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా హుమాయిన్ నగర్ పీఎస్ పరిధిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరోజిని దేవి ఆసుపత్రి సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొకైన్ కొనడానికి వచ్చిన వ్యక్తిని..అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అనే వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. వీరి వద్ద 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల డ్రై గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

Don't Miss