ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా

21:57 - December 20, 2016

చెన్నై : చెన్నై టెస్ట్‌లో టీమిండియాకు పోటీనే లేకుండా పోయింది. చెపాక్‌లోనూ ఇంగ్లీష్‌ టీమ్‌కు కొహ్లీ అండ్‌ కో చెక్‌ పెట్టింది. తొలి రెండు రోజులు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు  మిగతా మూడు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో భారత్‌కు చెక్‌ పెట్టింది. ఆఖరి టెస్ట్‌ చివరి రెండు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌....సిరీస్‌తో పాటు 2016 సీజన్‌ను విజయంతో ముగించింది. 
సిరీస్‌ భారత్ కైవసం... 
ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది. చెన్నై టెస్ట్‌నూ ఇంగ్లీష్‌ టీమ్‌కు కొహ్లీ అండ్‌ కో చెక్‌ పెట్టింది. ఆఖరి టెస్ట్‌ చివరి రెండు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌....సిరీస్‌తో పాటు 2016 సీజన్‌ను విజయంతో ముగించింది. 
జడేజా స్పిన్‌ మ్యాజిక్‌ 
చెపాక్‌లో తొలి రెండు రోజులు ఇంగ్లండ్‌ ఆధిపత్యం ప్రదర్శించగా...మిగతా మూడు రోజుల్లో ఆతిధ్య భారత్‌ పెద్ద సంచలనమే సృష్టించింది. మూడో రోజు రాహుల్‌ సెంచరీ, నాలుగో రోజు కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌సెంచరీతో ఒక్క సారిగా పోటీలో నిలిచిన భారత్‌....ఐదో రోజు జడేజా స్పిన్‌ మ్యాజిక్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌ జట్టు తేలిపోయింది. ఓపెనర్లు అలిస్టర్‌ కుక్‌, జెన్నింగ్స్‌ 40 ఓవర్ల పాటు పోరాడినా....జడేజా జాదూ ముందు నిలబడలేకపోయారు. జో రూట్‌, మొయిన్‌ అలీ, బెన్‌స్టోక్స్‌ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌ బోల్తా కొట్టించిన జడేజా భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. 
విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర 
జో బట్లర్‌ ఆఖర్లో ఒంటరిపోరాటం చేసినా ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. టెస్టుల్లో 6వ సారి 5 వికెట్ల ఫీట్‌ రిపీట్‌ చేసిన జడేజా ...7 వికెట్లు తీసి భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో  నెగ్గిన భారత జట్టు టెస్ట్‌ సిరీస్‌ను విజయంతో ముగించింది.
ఇంగ్లండ్‌ను బ్రౌన్‌ వాష్‌ చేసిన భారత్‌ 
5 మ్యాచ్‌ల సిరీస్‌ను  4-0తో నెగ్గిన భారత్‌....ఇంగ్లండ్‌ను బ్రౌన్‌ వాష్‌ చేసింది. 2012 టెస్ట్‌ సిరీస్‌లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రస్తుత సిరీస్‌తో భారత్‌ బదులుతీర్చుకుంది.
కరుణ్‌ నాయర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు
ట్రిపుల్‌ సెంచరీతో మ్యాచ్‌ను మలుపు తిప్పి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యంగ్‌గన్‌ కరుణ్‌ నాయర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.  గత 18 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండా విరాట్‌ సారధ్యంలోని  భారత జట్టు సాధించిన 15వ విజయం కావడం విశేషం. టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగేలేదని ఇంగ్లండ్‌ సిరీస్‌తో మరోసారి రుజువైంది. మరి కొహ్లీ అండ్‌ కో ఇదే జోరు కొనసాగిస్తే టెస్టు ఫార్మాట్‌లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 

Don't Miss