టీమిండియా...ట్రెడిషనల్‌ ఫార్మాట్‌..

09:34 - August 17, 2017

ఢిల్లీ : ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా డామినేషన్‌ కొనసాగుతోంది. టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా లంకతో మూడు టెస్టుల్లోనూ పోటీనే లేకుండా పోయింది. యాంగ్రీ యంగ్‌ విరాట్‌ కొహ్లీ..టీమిండియాను టెస్ట్‌ ఫార్మాట్‌లో ముందుండి నడిపిస్తున్నాడు. భారత్‌కు వరుసగా 8 టెస్ట్‌ సిరీస్‌ విజయాలందించిన కెప్టెన్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. టెస్టుల్లో టీమిండియా జైత్రయాత్రపై టెన్‌ స్పోర్ట్స్ ప్రత్యేక కథనం..

ప్రస్తుతం టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియా...ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా లంకతో మూడు టెస్టుల్లోనూ పోటీనే లేకుండా పోయింది. తొలి రెండు టెస్ట్‌లను నాలుగు రోజుల్లోనే నెగ్గిన భారత్‌...మూడో టెస్ట్‌లోనూ అంచనాలకు మించి రాణించింది. థర్డ్‌ టెస్ట్‌ను కేవలం మూడు రోజుల్లోనే నెగ్గి చరిత్రను తిరగరాసింది. తొలి టెస్ట్‌లో 304 పరుగుల భారీ తేడాతో నెగ్గిన భారత్‌....మిగతా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలు సాధించింది. శ్రీలంకను వారి సొంతగడ్డపై టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌ సాధించిన జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది.వరుసగా 8 టెస్టు సిరీస్‌లు నెగ్గిన జట్టుగా సైతం భారత్‌ అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.

యాంగ్రీ యంగ్‌ విరాట్‌ కొహ్లీ..టీమిండియాను టెస్ట్‌ ఫార్మాట్‌లో ముందుండి నడిపిస్తున్నాడు. భారత్‌కు వరుసగా 8 టెస్ట్‌ సిరీస్‌ విజయాలందించిన కెప్టెన్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. 29 టెస్టుల్లో టీమిండియాకు సారధ్యం వహించిన విరాట్‌ కొహ్లీ...19 టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. విరాట్‌ కెప్టెన్సీలో భారత్‌ కేవలం 3 టెస్టుల్లో మాత్రమే ఓడగా....7 టెస్టులను డ్రాగా ముగించింది. టెస్టుల్లో టీమిండియా ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చెప్పడానికి ఈ ప్రదర్శనే నిదర్శనం.వరుసగా 8 సిరీస్‌ల్లో ఓటమంటూ లేని టీమిండియా...ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో ఇదే స్థాయిలో రాణిస్తే, మరి కొన్నేళ్లు టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగడం ఖాయం.

Don't Miss