ఎన్ కౌంటర్..మృతి చెందింది వీరే..

11:12 - December 14, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం ఉలిక్కిపడింది. టేకులపల్లి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చండ్రపుల్లారెడ్డి బాట దళానికి చెందిన ఐదుగురు నక్సల్స్ హతమయినట్లు సీఐ సారంగపాణి పేర్కొన్నారు.

చండ్రపుల్లారెడ్డి కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ అజ్ఞాత దళంపై పలు కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టేకులపల్లి అటవీ ప్రాంతంలో వీరు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీనితో టేకులపల్లి పోలీసులు, గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. నక్సల్స్ కొంతమంది కంటపడ్డారు. పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిఘటించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృత్యువాతపడ్డారు. వీరి వద్ద ఐదు వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Don't Miss