తెలంగాణలో పోలింగ్ : మీడియాతో రజత్ కుమార్ :

12:29 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కావాల్సిన పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు...
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వచ్చిన 30 ఫిర్యాదుల్లో 25 వాటికి సమాధానం చెప్పినట్లు...5 ఫిర్యాదులకు సమాధానం చెప్పాల్సినవసరం ఉందన్నారు. కొడంగల్ విషయంలో జరిగిన ఘటనపై డీఈవో దగ్గరి నుండి రిపోర్టు తీసుకోవడం జరిగిందన్నారు. అక్కడి నుండి రెండు ఫిర్యాదులు వస్తే వెంటనే యాక్షన్ తీసుకున్నట్లు...ఫిర్యాదులపై డీఈవోలకు సమాచారం చేరవేస్తున్నట్లు వెల్లడించారు. ఇక టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఉందని..ఉచితంగానే టోల్‌ప్లాజా వద్ద అనుమతించాలని కోరడం జరిగిందన్నారు. వీవీ ప్యాడ్‌ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశ్యంతో కేంద్రాల్లో కొంత లైట్ తక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సాయంత్రం 7గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి  వివరాలు తెలిచేయనున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. 

Don't Miss