ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు..నిబంధనలు ఇవే...

07:58 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం డిసెంబర్ 5వ తేదీన ముగియనుంది. నియోజకవర్గాల్లో మైకులు మూగబోతుండగా ప్రచార రథాలు షెడ్లకు పరిమితం కానున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకు ప్రచారం ముగియనుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకు ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో ఈసీ పలు నిబంధనలు విధించింది. రాజకీయ పార్టీలు విధించిన సమయంలోగా ప్రచారం ముగించాలని పేర్కొంది. డిసెంబర్ 7 ఎన్నికలు ముగిసేవరకూ ఇది వర్తిస్తుందని..ఈ రోజుల్లో బహిరంగ సభలు..ప్రసంగాలూ చెయ్యకూడదని పేర్కొంది. అంతేగాకుండా ఊరేగింపులు..సినిమాలు..టీవీలు..ఇతర మార్గాల్లో ప్రచారం చేయకూడదని ఆదేశించింది. పోలింగ్ జరిగే చోట రాజకీయాలు పార్టీలు కార్యక్రమాలు..వేదికలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించింది. ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయవద్దని..డబ్బు, బహుమతులు ఇవ్వడం నేరమని పేర్కొన్న ఈసీ నియోజకవర్గంతో సంబంధం లేనివాళ్లు ఆ నియోజకవర్గంలో ఉండకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి రెండేళ్ల జైలు శిక్షతోపాటూ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. మరి ఈ నిబంధనలు...రాజకీయ పార్టీలు..పాటిస్తాయో లేదో చూడాలి. 

Don't Miss