పోలింగ్ పై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నిరాసక్తత..ఎందుకు ?

10:20 - November 17, 2018

హైదరాబాద్ : ఓట్ల పండుగ వచ్చేస్తోంది. తెలంగాన రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగనుంది. ప్రతొక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే విపరీతమైన ప్రచారం చేసింది. కానీ అందరి దృష్టి ‘సాఫ్ట్ వేర్’ వారిపైనే నెలకొంది. ఎందుకంటే వీరు ఓటు వేస్తారా ? లేదా ? అనే అందరి మదిలో నెలకొంది.
ఓటు వేయడానికి అనాసక్తి...
టైమ్ దొరకలేదని..ఏదో ఒక కారణం చెబుతూ కొందరు ఓటు ఎగ్గొడుతున్నారు. గత శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ 32 శాతం అంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ రాగానే వీరంతా షికార్లకు..ఇతర ప్రాంతాలకు కుటుంబసమేతంగా వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రధానంగా నగరంలో వివిధ కంపెనీలలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అధికారంగా ఉంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం కరెక్టు కాదని పలువురు పేర్కొంటున్నారు. 
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 27 నియోజకవర్గాలున్నాయి. 
ఈ మూడు జిల్లాల్లో 88 లక్షల మంది ఓటర్లున్నారు. 
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ 53 శాతం మాత్రమే. 

రెండు రోజులు సెలవులు...
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీ (శుక్రవారం) ఎన్నికలు జరుగున్నాయి. అంటే శని, ఆదివారాల్లో ఈ ఉద్యోగులకు వీకెండ్ సెలవు ఉంటుంది. ఈ సెలవుల్లో వీరు విహార యాత్రలకు..ఇతర ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు పోలింగ్ జరిగే రోజు అంటే శుక్రవారం ఉద్యోగులంతా ఏదో ఒక సమయంలో కార్యాయాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కోరారు. ఈసారి ఓటు శాతం పెంచాలనీ, కనీసం 80 శాతం మంది ఓటు వేసేలా చెయ్యాలని  అధికారులు భావిస్తున్నారు. మరి ఓటు శాతం పెరుగుతుందా ? సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

 

Don't Miss